SRPT: నేడు నూతనకల్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో జరిగే గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో సునీత తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు జరుగుతాయని అన్నారు. గ్రామసభల నిర్వహణలో పంచాయితీ కార్యదర్శులతో పాటు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు.