TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలుచోట్ల రేషన్ బియ్యం తుకాల్లో మోసం జరుగుతోందని స్థానికులు అరోపిస్తున్నారు. కేజీ బియ్యానికి పావు కేజీపైగా తగ్గించి ఇస్తున్నరని, తూనికలు కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బియ్యంతో పాటు పప్పులు, రాగులు, జొన్నలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, చక్కెర తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.