KNR: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి స్థానిక ఎక్సైజ్ కోర్టు జరిమానాతో పాటు వినూత్న శిక్ష విధించింది. కరీంనగర్ శివాజీనగర్‌కు చెందిన నెదునూరి రమేష్‌కు రూ. 4,000 జరిమానా విధిస్తూనే, మూడు రోజుల పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి ఈదుల లక్ష్మి తీర్పునిచ్చారు.