కామారెడ్డిలో బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేదిక వద్ద తాగునీరు, విద్యుత్, భద్రత వంటి ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఈ వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు.