SRD: కంగ్టిలో శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం సిద్దేశ్వర మఠం వద్ద సిద్ధంగా ఉన్న దేవుని శిఖరానికి పూజలు చేసి గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. పురవీధుల గుండా శిఖరాన్ని భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలతో పాండురంగ మందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఇందులో సర్పంచ్ కృష్ణ, ఆలయ చైర్మన్ దారం వెంకన్న, విట్టల్ రెడ్డి ఉన్నారు.