VSP: రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 MLA సీట్లు ఉండగా.. అవి 23-24కి చేరే అవకాశం ఉంది. అదే విధంగా అరకు పార్లమెంట్ పార్వతీపురంతో కలిసి ఉండగా.. కొత్తగా మరో MP స్థానం పెరగొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.