ADB: మావల గ్రామం సర్వే నెం.167/1 కు సంబంధించిన భూమిపై అక్రమంగా ప్రవేశించి, యజమాని రాకేష్ శర్మను బెదిరించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SHO రాహుల్ కాంత్ మంగళవారం తెలిపారు. నిందితులలో అజయ్, కిరణ్, యోగేష్‌ను అరెస్టు చేయగా రాజ్ సిద్ధార్థ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. భూదందాలు, బెదిరింపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని రాహుల్ కాంత్ హెచ్చరించారు.