BHNG: బుధవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వార్డులు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటేషన్ పనులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకన్నారు.