MBNR: మహబూబ్ నగర్ 12వ డివిజన్లోని జాండ్ర శ్మశాన వాటికలో అన్ని వసతులు కల్పిస్తామని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం డివిజన్లో పర్యటించిన ఆయనకు ప్రజలు పలు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యం, ఇతర నాయకులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.