వరంగల్ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు శరత్, ప్రశాంత్, నరేష్ ఆరోపించారు. కళాశాలలో అవసరమైన 15 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరూ కూడా లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ఆధ్యాపకులను నియమించాలని కోరారు.