TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరులో పోలీసులు బుధవారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సైబర్ నేరాలు, గంజాయి కట్టడి, రోడ్డు భద్రతపై SI అజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ చెప్పవద్దని ప్రజలను హెచ్చరించారు. అత్యవసర సమయంలో 100/112 సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.