HYD: ఆన్లైన్ బెట్టింగ్‌ల కోసం సిలిండర్ల చోరీకి పాల్పడుతున్న సందీప్ అనే వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ హోటళ్లు, హాస్టళ్లే లక్ష్యంగా ఇతడు దొంగతనాలకు పాల్పడేవాడు. నిందితుడి నుంచి 31 వాణిజ్య సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.