BHPL: గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో గ్రామ సభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. చెల్పూరు గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. చెల్పూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు.