టాలీవుడ్ నటుడు సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబోలో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అనే సాంగ్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ‘మత్తు వదలరా’ టీమ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.