MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో బుధవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. పురోహితుడు రాము శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ మాలాధారణ స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వేడుకల్లో గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో దీక్షా స్వాములు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.