ప్రకాశం: పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెం ఎంపీ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడుపై వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉప విద్యాశాఖ అధికారి విచారణ చేశారు. నివేదిక మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పొన్నలూరు ఎంఈఓ రవి తెలిపారు