NLG: శాలిగౌరారం మండలం, అడ్లూరు, వల్లాల గ్రామాల్లో కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బుధవారం పర్యటించారు. ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు చేశారు. ఉపాధి హామీ కూలీలకు నీడతో పాటు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వన మహోత్సవం కింద రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని సూచించారు. నర్సరీలను సందర్శించారు.