MHBD: జిల్లాలోని 5 ICDS ప్రాజెక్టుల పరిధిలోని 50 అంగన్వాడి కేంద్రాలకు RO వాటర్ ఫిల్టర్లు, బాలా పెయింటింగ్ కొనుగోలు చేయడానికి టెండర్లు ఆహ్వానించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సబిత తెలిపారు. ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో రిజిస్టర్డ్ అయిన వ్యాపారులు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో టెండర్లు దాఖలు చేయాలన్నారు.