»Tragedy At Jagityalas Brs Rally Counselors Husband Dies
Bandari Narendra : జగిత్యాల బీఆర్ఎస్ ర్యాలీలో విషాదం. కౌన్సిలర్ భర్త మృతి
జగిత్యాల జిల్లా(Jagityala District) లోని గాంధీనగర్లో బీఆర్ఎస్ పార్టీ (BRS) నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని విషాదం నెలకొంది.. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం(Statue of Telangana Mother) వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. వారంతా గుండ్రంగా ఉండి నృత్యాలు చేస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజనీ (Bandari Rajni) భర్త బండారి నరేందర్ మధ్యలో ఉండి వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
జగిత్యాల జిల్లా(Jagityala District) లోని గాంధీనగర్లో బీఆర్ఎస్ పార్టీ (BRS) నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని విషాదం నెలకొంది.. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం(Statue of Telangana Mother) వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. వారంతా గుండ్రంగా ఉండి నృత్యాలు చేస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజనీ (Bandari Rajni) భర్త బండారి నరేందర్ మధ్యలో ఉండి వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటినా అయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు.
చదవండి :
ఆయన మృతితో కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పాల్గొననున్నారు. ఈడీ (ED) విచారణ తరువాత తొలిసారిగా నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత రానున్నారు. గాంధీనగర్ (Gandhinagar) నుండి ర్యాలీగా వచ్చి కొత్త బస్టాండ్ దగ్గర వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కవితకు స్వాగతం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.