వాహనదారులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది.వెహికల్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు(Pollution Testing Fee)ను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ (Department of Transport)తెలిపింది.ఈ మేరకు జీవో నెంబర్ 23ను విడుదల చేసింది. ఇక నుండి వెహికిల్ ను పరీక్షించి సర్టిఫికెట్ (Certificate) జారీ చేసేందుకు బైక్ కు రూ.50, పెట్రోల్ త్రీవీలర్స్ కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్ల(Diesel cars)కు రూ.100, డీజిల్ లో ఇతర కేటగిరీ వాహనాలన్నింటికీ రూ.100 చొప్పున ఫీజును వసూలు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏడేళ్ల క్రితం ఉన్న ఛార్జీలను వసూలు చేస్తున్నారని, కానీ ఈ ఏడేళ్ల కాలంలో వేతనాలు, వ్యయాలు పెరిగాయని, ఈ నేపథ్యంలో ఫీజును పెంచుతున్నట్లు తెలిపింది.