తెలంగాణ (Telangana) శాసనసభ ఎన్నికలు నవంబర్ చివరి నాటికి జరగడం ఖాయమని సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని నల్గొండ (Nalgonda) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడ నియోజక వర్గంలో 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయం తప్పుకుంటానని ఆయన అన్నారు.సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. 1994లో నేను మొదటి సారి శాసనసభ సీటుకు పోటీ చేసి ఓడిపోయాను. అప్పటి నుంచి ఏ హోదాలో ఉన్న కోదాడ (Kodada) ప్రాంతాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. మాకు పిల్లలు లేరు.. కోదాడ నియోజకవర్గ ప్రజలే నా పిల్లలని ఎంపీ ఉత్తమ్ అన్నారు. వడ్డీతో సహా తీర్చుకోవాల్సిన టైం వస్తుంది. సోషల్ మీడియా ద్వారా జనాలను చాలా ప్రభావితం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ (Congress party) హయాంలోనే కోదాడ అభివృద్ధి జరిగిందన్నారు. కోదాడలో ఇప్పుడు మొత్తం స్యాండ్, ల్యాండ్ మైన్స్ , వైన్స్. అంతేకాకుండా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఎమ్మెల్యే మట్టి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కోదాడ, హుజూర్ నగర్ లో చెప్పలేని విధంగా పోలీసులు వ్యవస్థ వ్యవహరిస్తోంది. కొంత మంది పనికట్టుకొని నా మీద, పద్మావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని అని ఆయన తెలిపారు