• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అన్యాయ వ్యాపారాలపై ప్రశ్నించాలి: కలెక్టర్

GDWL: కల్తీ ఆహారం, నకిలీ ఉత్పత్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసరా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. అన్యాయ వ్యాపార విధానాలపై వినియోగదారులు ప్రశ్నించాలన్నారు.

March 14, 2026 / 07:40 PM IST

‘డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం’

MDK: డ్రగ్స్‌కు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దామని తూప్రాన్ SI గంగరాజు పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో ప్రజలకు అవగాహన చేపట్టారు. ప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దని సూచించారు.

March 14, 2026 / 07:40 PM IST

నూతన సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: పదర మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తక్కువ వోల్టేజ్ సమస్యలు తగ్గి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 07:40 PM IST

రేపు జడ్చర్లలో మంత్రిపర్యటన

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో నూతనంగా నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.

March 14, 2026 / 07:38 PM IST

30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం

KMR: జిల్లాలోని పలు వాణిజ్య సంస్థల్లో అక్రమంగా వినియోగిస్తున్న 30 గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలోని నస్రుల్లాబాద్​, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో పలు హోటళ్లు, మెస్​లు, వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

March 14, 2026 / 07:36 PM IST

‘మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి’

KNR: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ స్వశక్తి సంఘం మహిళలు శనివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధర ప్రజా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో అదనపు స్వశక్తి సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు.

March 14, 2026 / 07:35 PM IST

సమాజంలో స్నేహబావం బలపడాలి: ఎమ్మెల్యే

BDK: అశ్వాపురం మండలంలోని జామా మసీదులో నిర్వహించిన పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ విందు శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓరుగంటి బిక్ష్మయ్య, గాదె కేశవరెడ్డి పాల్గొన్నారు.

March 14, 2026 / 07:34 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహశీల్దార్

ADB: తలమడుగు, బరంపూర్ పదో తరగతి పరీక్ష కేంద్రాలను తహశీల్దార్ రాజ్ మోహన్ శనివారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావుండకూడదని అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు సహా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆయనతో పాటు ఎస్సై రాధిక, తదితరులు ఉన్నారు.

March 14, 2026 / 07:31 PM IST

రేపు చెరువు సుందరీకరణ పనులకు భూమి పూజ

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు యొక్క సుందరీకరణ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేయనున్నారని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకు రూ. 314 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పనులకు ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.

March 14, 2026 / 07:30 PM IST

బోయలపల్లి–బొమ్మన్ పాడు రోడ్డుపై వినతి

NRPT: నారాయణపేట మండలం బోయలపల్లి నుంచి బొమ్మన్ పాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కోటకొండ ఆటో యూనియన్ నేతలు తెలిపారు. శనివారం ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని యూనియన్ నేత రాజు వివరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

March 14, 2026 / 07:27 PM IST

రోడ్డు సమస్యపై వినతి పత్రం అందజేత

NRPT: నారాయణపేట మండలం బోయలపల్లి నుంచి బొమ్మన్ పాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కోటకొండ ఆటో యూనియన్ నేతలు తెలిపారు. శనివారం ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని యూనియన్ నేత రాజు వివరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

March 14, 2026 / 07:27 PM IST

అమృత్ మిత్రగా ఎంపికైన మహిళా సంఘం సభ్యురాలు

PDPL: రామగుండం కార్పొరేషన్లో విధులు నిర్వహించే మార్గదర్శి స్లమ్ సమాఖ్య శ్రీ సరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు బూర్గుల అనిత అమృత్ మిత్రగా ఎంపికైంది. ఈనెల 13న న్యూఢిల్లీలో జరిగిన అమృత్ మిత్ర మహోత్సవంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లలో పనిచేసే ఐదుగురిలో అనితకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా అనితను పలువురు అధికారులు అభినందించారు.

March 14, 2026 / 07:26 PM IST

‘ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి’

HYD: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి అన్నారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో HYD ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభయహస్తం పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కార్యచరణ రూపొందించాలన్నారు.

March 14, 2026 / 07:25 PM IST

వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన DMHO

ASF: వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రిని DMHO సీతారాం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాక్సిన్ రూమ్, మందుల స్టోర్, HPV వ్యాక్సిన్ సెంటర్, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాల్సిన అవసరాన్ని, పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వహణపై కచ్చితమైన పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.

March 14, 2026 / 07:22 PM IST

భద్రాచలం బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

WGL: జిల్లా కేంద్రంలో శనివారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖను దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, భద్రాచలం ఆలయ ఈవో సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించనున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంలో ఆలయ అర్చకులు ఉన్నారు.

March 14, 2026 / 07:20 PM IST