• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇసుక అక్రమంగా తరలింపు.. కేసు నమోదు

NRPT: ఊట్కూర్ మండలంలోని త్రిప్రాస్‌పల్లి గ్రామానికి చెందిన మక్తల్ రాజు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చెకోపోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు చూపించాలని కోరగా డ్రైవర్ చూపించలేకపోవడంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అనంతరం మక్తల్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 15, 2026 / 06:45 AM IST

మహిళా సర్పంచ్ల భర్తలు పెత్తనం చేయొద్దు: మంత్రి

WGL: మహిళా సర్పంచ్ల భర్తలు పెత్తనం చేయకూడదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మహిళా సర్పంచ్లు ప్రొటోకాల్ విస్మరించకుండా జాగ్రత్తగా ఉండాలని, జనరల్ బాడీ మీటింగ్‌లలో సమయం వృథా చేయకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, మహిళా సర్పంచ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

March 15, 2026 / 06:45 AM IST

VIDEO: కాలభైరవ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

SRCL: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారిని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు శనివారం దర్శించుకున్నారు. కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 15, 2026 / 06:44 AM IST

రీజినల్ రింగ్ రైల్.. సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

HYD: నగరం చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు(RRR) వెంట రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం డీపీఆర్ తయారీకి అవసరమైన సర్వేకు అనుమతులు మంజూరు చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ వెల్లడించారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన వెలువడింది.

March 15, 2026 / 06:43 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక్కరు మృతి

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మల్లప్ప (70) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 06:43 AM IST

‘అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని MLA వినోద్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని బెల్లంపల్లి మండలం బాబుక్యాంప్ జామా మసీద్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

March 15, 2026 / 06:41 AM IST

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు శ్రీకారం

SRD: పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గంలో BJP పార్టీ బలోపేతానికి కసరత్తు ప్రారంభించామని BJP మండల అధ్యక్షుడు ఈర్ల రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కమిటీ కన్వీనర్ సముద్రాల రాకేష్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ నెల 21న శిక్షణ తరగతుల తుది రూపం తీర్చిదిద్దనున్నామని అన్నారు.

March 15, 2026 / 06:38 AM IST

థర్డ్ పార్టీ అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

ADB: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మితిమీరి అమాయకులను మోసం చేస్తున్న సందర్భంలో ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. థర్డ్ పార్టీ అప్లికేషన్లను వినియోగిస్తూ మొబైల్ ఫోన్‌లో వాటికి పూర్తిగా అనుమతులను ఇవ్వడం వల్ల మొబైల్ ఫోన్ డాటా అనేది చోరీకి గురవుతుందని పేర్కొన్నారు.

March 15, 2026 / 06:35 AM IST

గుడి బయటే కేంద్రమంత్రి మొక్కులు

JGL: కరీంనగర్ నుంచి బీజేపీ నూతన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో పాదయాత్రగా బయలుదేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా ఆలస్యంగా కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకే ఆలయానికి చేరుకోవాల్సిన ఆయన రాత్రి 10 దాటాక ఆలయానికి చేరుకోవడంతో, అప్పటికే ఆలయం ముసివేశారు. ప్రధాన ద్వారం ముందే పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

March 15, 2026 / 06:32 AM IST

నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

HNK: ఎల్కతుర్తి మండలం కేంద్రంలోని సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE సుధాకర్ తెలిపారు. మరమ్మతు పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరాను పున:రుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

March 15, 2026 / 06:32 AM IST

‘లక్ష్యసాధనకు చిన్నప్పటినుంచే కృషి చేయాలి’

MBNR: విద్యార్థులకు చదువుతోపాటు బయటి ప్రపంచంపై అవగాహన కలిగి ఉండాలని మహబూబ్‌నగర్ ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ పట్టణ శివారులోని మౌంట్ బాసిల్ పాఠశాలలో నిర్వహించిన అన్యువల్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు.

March 15, 2026 / 06:32 AM IST

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

NZB: జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ డాక్టర్ బీ. రాజశ్రీ శనివారం తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ ఫ్లా ఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

March 15, 2026 / 06:30 AM IST

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు

SDPT: ధూళిమిట్ట గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన సుద్దాల బాబు (32) అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎండి అసిఫ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 15, 2026 / 06:30 AM IST

సోదరభావానికి ప్రతీక రంజాన్: ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ వేడుక ముస్లిం సోదరుల ఐక్యతకు, స్నేహానికి నిదర్శనమని వారు కొనియాడారు.

March 15, 2026 / 06:30 AM IST

ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు కీలక నిర్ణయం

PDPL: మంథని మండలం గుంజపడుగులో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ సంధ్య ఆధ్వర్యంలో వ్యాపారులతో కలిసి తీర్మానించారు. చికెన్, మటన్, చేపలు, కిరాణా షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను ప్రతిరోజూ తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబండిలో వేయాలని, ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

March 15, 2026 / 06:28 AM IST