• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చెత్తతో కలుషితమైన ఇల్లందులపాడు చెరువు

భద్రాద్రి: ఇల్లందుకు తాగునీరు అందించే ఇల్లందులపాడు చెరువు చెత్తాచెదారంతో కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువును శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే చెరువు వద్ద రాత్రి వేళల్లో జరిగే మందుబాబుల హంగామాను అరికట్టాలన్నారు.

March 15, 2026 / 09:42 AM IST

జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

KMR: ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు డీఈవో రాజు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం, పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

March 15, 2026 / 09:41 AM IST

‘డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

WGL: జిల్లాలో కొత్త రకమైన డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కొందరు మోసగాళ్లు ఫోన్ కాల్స్ చేసి తాము పోలీసు, ప్రభుత్వ అధికారులమని చెబుతూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగా ఎవరైనా కాల్ చేస్తే 1930 సంప్రదించాలని కోరారు.

March 15, 2026 / 09:39 AM IST

గచ్చిబౌలి హాకీ మైదానానికి అంతర్జాతీయ గుర్తింపు

HYD: గచ్చిబౌలి స్టేడియంలోని హాకీ మైదానానికి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) అధికారికంగా ‘కేటగిరీ 2’ ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. తెలంగాణ ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాల పట్ల చూపుతున్న నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం. ఈ సర్టిఫికేషన్‌తో ఇప్పుడు ఈ స్టేడియం అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు, టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవడం విశేషం.

March 15, 2026 / 09:39 AM IST

రోడ్డుపైనే చెత్త.. ప్రయాణికుల ఇబ్బందులు

GDWL: మల్దకల్ మండలం ఎల్కూరు రోడ్డుపై చెత్తకుండీలు నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారిపైనే వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రజా పాలన’ ప్రణాళికలో భాగంగా ఈ చెత్తను వెంటనే డంపింగ్ యార్డు తరలించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

March 15, 2026 / 09:37 AM IST

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కాటారం విద్యార్థులు

BHPL: కాటారం మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు చరణ్, శివబాలాజీ రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు HM ఆసనాడ మాధవి తెలిపారు. HYD చింతల్ బస్తీలో జరుగుతున్న పోటీల్లో వీరు పాల్గొంటారని HM పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను HM మాధవి, వైస్ ప్రిన్సిపల్ మహేందర్, PET శ్రీనివాస్ అభినందించారు.

March 15, 2026 / 09:35 AM IST

రూ.151 కే భద్రాచలం కళ్యాణ తలంబ్రాలు

SRD: శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే అందజేయనున్నట్లు సంగారెడ్డి ఆర్ఎం విజయ భాస్కర్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా కేవలం రూ.151 చెల్లించి తలంబ్రాలు పొందవచ్చని పేర్కొన్నారు. భద్రాద్రి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఈ సేవను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.

March 15, 2026 / 09:32 AM IST

గ్రామపంచాయతీ సిబ్బందికి సానిటరీ వస్తువుల పంపిణీ

JGL: పెగడపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి సర్పంచ్ అరుణ ఆధ్వర్యంలో శానిటరీ వస్తువులను పంపిణీ చేశారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు గాను శానిటరీ వస్తువులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రదీప్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

March 15, 2026 / 09:30 AM IST

భగ్గుమంటున్న చికెన్ ధర!

NZB: జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రస్డ్ చికెన్ రూ.280 నుంచి రూ.290 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ.325 వరకు పలుకుతోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపడం, వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

March 15, 2026 / 09:30 AM IST

కార్మిక ఉద్యమ నేత రాములు 22వ వర్ధంతి సభ

PDPL: గోదావరిఖనిలో శనివారం కార్మిక ఉద్యమ నేత యు.రాములు 22వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాములన్న మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా, సింగరేణి, ఎన్టిపిసి, ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల హక్కుల కోసం పోరాడాలన్నారు.

March 15, 2026 / 09:28 AM IST

రేపటి నుంచి ఖోఖో క్రీడాకారుల ఎంపిక

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న మహిళలు, 17న పురుషుల ఖో ఖో జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు (17-25 ఏళ్ల వారు) పాల్గొనవచ్చు. ఇక్కడ ఎంపికైన వారు ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

March 15, 2026 / 09:27 AM IST

యుద్ధ మేఘాలు.. వంట గదిలో భగ్గుమంటున్న మంట

ఖమ్మం: అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు జిల్లాలో సామాన్యుడి వంట గదిపై పెనుభారం మోపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల క్రితం రూ.155 ఉన్న సన్ ప్లవర్ ఆయిల్ రూ. 180కు, రూ. 110 ఉన్న పామాయిల్ రూ.135కు చేరింది. వేరుశనగ, కొబ్బరి నూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

March 15, 2026 / 09:25 AM IST

ఉరేసుకొని ఆర్ఎంపీ బలవన్మరణం

SDPT: గజ్వేల్ మండలం గిరిపల్లికి చెందిన నెమటూరి చిన్నమల్లయ్య (41) అనే ఆర్ఎంపీ అప్పుల బాధతో గజ్వేల్లోని అద్దె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ అవసరాల కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక ఆరు నెలలుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం అతని ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

March 15, 2026 / 09:25 AM IST

‘ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేయాలి’

NRML: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేయాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తికి వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ సభ్యులు విన్నవించారు. ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాల ఆధ్వర్యంలో వైస్ ఛైర్మన్, శాంతినగర్, వెంకటాపూర్ కౌన్సిలర్‌ను వారు ఘనంగా సన్మానించారు.

March 15, 2026 / 09:24 AM IST

తాండూర్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం

VKB: తాండూర్ మాజీ MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్‌లో ఈగల్ టీం, SOT సంయుక్తంగా రైడ్ చేశారు. అక్కడ కొకైన్, ఇతర డ్రగ్స్ దొరికినట్లు తెలిసింది. ఈగల్ టీమ్‌ను చూసి ఒక వ్యక్తి ఫైరింగ్ చేశాడని, వెంటనే పోలీసులు రివాల్వర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

March 15, 2026 / 09:20 AM IST