PDPL: గోదావరిఖనిలో శనివారం కార్మిక ఉద్యమ నేత యు.రాములు 22వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాములన్న మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, సింగరేణి, ఎన్టిపిసి, ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల హక్కుల కోసం పోరాడాలన్నారు.