NRML: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేయాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తికి వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ సభ్యులు విన్నవించారు. ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాల ఆధ్వర్యంలో వైస్ ఛైర్మన్, శాంతినగర్, వెంకటాపూర్ కౌన్సిలర్‌ను వారు ఘనంగా సన్మానించారు.