MHBD: గాలివారిగూడెంలోని ANR గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం జరిగిన బైక్ చోరీ కేసును SI వీరభద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు చేదించారు. పోలీసుల తనిఖీలు చేపట్టగా.. కార్గిల్ సెంటర్ వద్ద నిందితులు గోపీచంద్, మనోజ్‌ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 బైకులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.