SRD: జహీరాబాద్ పట్టణంలో గ్యాస్ కొరత ఉందన్న వార్తలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్ ఆధ్వర్యంలో గ్యాస్ గోదాంను పరిశీలించారు. గోదాంలో సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధీర్ బండారి, కౌన్సిలర్ పాల్గొన్నారు.