• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాధితుడి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు

SRPT: గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సర్వారం గ్రామానికి చెందిన కాంతయ్యను గరిడేపల్లి పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా ఎస్సై నరేష్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాపీని అందజేశారు.

March 14, 2026 / 07:18 PM IST

ప్రమాద ఘటన ప్రదేశం సందర్శించిన ఎస్పీ

MDK: కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సందర్శించారు. ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

March 14, 2026 / 07:16 PM IST

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన కాయితోజు దిలీప్(26) అనే యువకుడు ఎంబీఏ చదివినప్పటికీ ఉద్యోగం లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఇనుప రాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

March 14, 2026 / 07:16 PM IST

భైంసా మండలంలో గ్యాస్ ఏజెన్సీలలో అధికారుల తనిఖీలు

NRML: భైంసా మండలలోని గ్యాస్ ఏజెన్సీలలో తహసీల్దార్ ప్రవీణ్, అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏజెన్సీ కార్యాలయంలో గల రిజిస్టర్లను పరిశీలించారు. గోదామును పరిశీలించి అక్కడ ఉన్న సిలిండర్లను పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించవద్దని హెచ్చరించారు. సిలిండర్లను పక్కదారి పట్టించిన, బ్లాక్‌లో అమ్మిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

March 14, 2026 / 07:14 PM IST

‘నిర్ణీత గడువులోగా లక్ష్యాలను సాధించాలి’

MLG: వెంకటాపూర్(M)కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ‘ప్రజా పాలన-99 రోజుల ప్రగతి ప్రణాళిక’పై ప్రత్యేక అధికారి సాల్మన్ రాజు, DRDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు. కార్యక్రమంలో MRO గిరిబాబు, MPDO రాజు, SI చల్ల రాజు, సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు.

March 14, 2026 / 07:14 PM IST

ఈ నెల 16న కుల్కచర్ల PHCలో వైద్య శిబిరం

VKB: వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డా.కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నెల 16న కుల్కచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య నిపుణులతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, చిన్న పిల్లలు, దంత సమస్యలు, కళ్ల సంబంధిత వైద్య నిపుణులచే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

March 14, 2026 / 07:14 PM IST

పీహెచ్‌డీ పట్టా పొందిన తిమ్మాపూర్ తండావాసి

JGL: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన మాలవత్ నిఖిల్ నాయక్ ఆంగ్ల భాష విద్య విభాగంలో PHD పట్టా పొందారు. ‘మల్టీ మోడల్ కంపోజిషన్స్ ఇన్ ది ఇండియన్ ఈఎస్ఎల్ క్లాస్ రూమ్’ అనే శీర్షికతో ఆయన సమర్పించిన పరిశోధన గ్రంథానికి దేశంలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమైన ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు.

March 14, 2026 / 07:12 PM IST

ఉన్నత ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు

MNCL: మంచిర్యాలలోని మహాత్మా జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. పెద్దపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో విద్యార్థులు అన్మోల్, యశ్వంత్, ఆకాశ్, హర్షవర్ధన్, వెంకట్, శివమణి ప్రతిభ కనబరిచి ఫార్మా, అపోలో, మెడిప్లస్ కంపెనీల్లో మేనేజర్లుగా ఎంపికయ్యారు.

March 14, 2026 / 07:12 PM IST

గిరిజన మహిళ హత్య కేసుపై ఏసీపీ విచారణ

NZB: ధర్పల్లి మండలం సీతాయిపేట్ తండాకు చెందిన గిరిజన మహిళ కాంతామణి హత్య కేసు వివరాలను ఏసీపీ బీ.ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. శనివారం ఘటన స్థలానికి చేరుకున్న ఆయన.. సీఐ బిక్షపతి, ఎస్సై శ్రీనివాస్‌ల నుంచి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అలాగే ఓన్నాజీపేట్ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు వివరాలను సమీక్షించారు.

March 14, 2026 / 07:11 PM IST

GWMCలో నత్తనడకన పన్ను వసూలు..!

WGL: గ్రేటర్ వరంగల్ GWMCలో ఆస్తి పన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుకు 18 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, సగటున 50 శాతం మాత్రమే వసూళ్లు జరిగాయి. లక్ష్యం సాధించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలతో ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరతతో పూర్తి లక్ష్యం సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

March 14, 2026 / 07:10 PM IST

‘ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి’

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న అధునాతన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆసుపత్రిలో నవజాత శిశు సేవలు, 2 డి ఎకో, లాప్రాస్కోపిక్ శస్త్ర చికిత్సలు, యూరాలజీ మరియు రూట్ కెనాల్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సేవలలో ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

March 14, 2026 / 07:08 PM IST

డ్రైనేజీ పనులు పూర్తిచేయాలని వినతి

SRD: పటాన్చెరు మండలం భారతి నగర్ నగర్ డివిజన్ పరిధిలోని ఫెన్సింగ్ ఏరియా, MIG ప్రాంతాలలో పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. శనివారం HMWSSB MD అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేయించి వెంటనే పూర్తి చేయాలని కోరారు.

March 14, 2026 / 07:08 PM IST

పిల్లల పై ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

BHPL: జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేసవి తాపం పెరుగుతున్నందున చిన్నారులు ఈత కోసం సమీపంలోని నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లే అవకాశం ఉందని SP సిరిశెట్టి సంకీర్త గౌడ్ హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని, వారిని ఒంటరిగా నీటి ప్రదేశాల వద్దకు వెళ్లనివ్వకూడదని సూచించారు.

March 14, 2026 / 07:07 PM IST

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

SRPT: కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన కళ్యాణి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆమెకు ఈ గౌరవ పట్టాను అందజేశారు. ఆదివాసీల సమస్యలపై ప్రొఫెసర్ నాయుడు అశోక్ పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. తన విజయంలో సహకరించిన తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

March 14, 2026 / 07:07 PM IST

చేనేత కార్మికులకు పరికరాల పంపిణీ

NRPT: నారాయణ పేట మండలం కోటకొండ గ్రామంలో శనివారం ఎంపీ డీకే అరుణ చేనేత కార్మికులకు మగ్గం, పరికరాలను పంపిణీ చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద కోటకొండ గ్రామాన్ని హ్యాండ్లూమ్ క్లస్టర్‌గా ఎంపిక చేసిందని అన్నారు. మొదటి విడతలో 70 మందికి పరికరాలు అందించామని చెప్పారు.

March 14, 2026 / 07:02 PM IST