RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కూమర్ యాదవ్ లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
KMR: జుక్కల్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి పూజలో పాల్గొన్న ఆయన, శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.
HNK: పరకాల పట్టణ కేంద్రంలోని M.N రావు గార్డెన్స్‌లో శనివారం విష్ణుప్రియాంక-అరవింద్ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
NRML: గత ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్సుడ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్ల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే ఏలేటికి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6500 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యామని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు.
JGL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో అవసరమని జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈవో,ఏఎన్ఎo పాల్గొన్నారు.
MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వినోద్ కోరారు. శనివారం బెల్లంపల్లిలోని 23,16వ వార్డులలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ASF: వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామ BJP సర్పంచ్ సోయం శ్రీదేవి-సంజీవ్, ఉప సర్పంచ్ మెస్రం సీతారాం తన అనుచరులతో కలిసి BRS పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై BRSలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
MHBD: గూడూరు మండలం గన్యచకృ తండాకి చెందిన భార్యభర్తలు హైదరాబాదులో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం వారి చిన్న కూతురు వసంతకు తెలియదు. విషయం తెలిస్తే ఈరోజు జరిగే పదో తరగతి పరీక్షపై ప్రభావం పడుతుందని స్థానికులు ఆమె దగ్గర విషయాన్ని దాచారు. పరీక్ష పూర్తైన అనంతరం ఆమెకు విషయాన్ని చెప్పడంతో కన్నీరు మున్నీరైంది.
ADB: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆశన్న శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.
WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ పకృతి వనాన్ని నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ సందర్శించారు. ప్రకృతి వనాల ద్వారా పట్టణంలోని కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాల్సిందిగా ప్రజలను కోరారు.
KMR: జిల్లాలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 1,738 మంది విద్యార్థులకు గాను 1,588 మంది హాజరు కాగా, 150 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం జరిగాయని ఆయన వివరించారు.
KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం RWS అధికారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
KMM: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో కార్యచరణలో భాగంగా శనివారం కల్లూరు మున్సిపాలిటీ నాలుగో వార్డులో మున్సిపల్ ఛైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. ఈ పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి పర్యవేక్షించారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించారు.
NZB: సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డా .రాజశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పాత భవనాన్ని, రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ రాజ్కుమార్ పాల్గొన్నారు.