NRPT: నారాయణ పేట మండలం కోటకొండ గ్రామంలో శనివారం ఎంపీ డీకే అరుణ చేనేత కార్మికులకు మగ్గం, పరికరాలను పంపిణీ చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద కోటకొండ గ్రామాన్ని హ్యాండ్లూమ్ క్లస్టర్‌గా ఎంపిక చేసిందని అన్నారు. మొదటి విడతలో 70 మందికి పరికరాలు అందించామని చెప్పారు.