KMM: ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద నిరసన చేపట్టారు. 2024లో వచ్చిన వరద విపత్తుకు బ్రిడ్జికూలిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు.