GDWL: ఇటిక్యాల మండలం ఉదండాపురం నుంచి మల్దకల్ వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతల మరమ్మతుల కోసం కంకర వేసిన అధికారులు, నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయకుండా వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. కంకర తేలి ఉండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.