NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 23న తై బజార్, చికెన్ వేస్ట్ సేకరణ, జంతు వధశాల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఆసక్తి గల వారు ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తై బజార్, చికెన్ వేస్ట్ టెండర్ కోసం రూ.5 లక్షలు, జంతు వధశాల కోసం రూ.40,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.