• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఐక్యంగా ఉండి ముందుకు సాగాలి’

SRCL: మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని ముస్తాబాద్ మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు బొప్ప నర్సయ్య అన్నారు. ముస్తాబాద్‌లో మున్నూరు కాపులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. కాపులు బీసీ జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ చైతన్యంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. అందరు ఐక్యంగా ఉండి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.

March 20, 2026 / 08:16 PM IST

హైవే ప్రమాద బాధితుడికి నష్టపరిహారం అందజేత

KMM: జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదానికి గురైన కార్మికుడు పర్వేష్‌కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు రూ. 31.31 లక్షల నష్టపరిహారపు చెక్కును అందజేశారు. కార్మిక నష్టపరిహార చట్టం కింద సంబంధిత యాజమాన్యం ఈ మొత్తాన్ని చెల్లించింది. పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగినా కార్మికులు వెంటనే జిల్లా కార్మిక శాఖను సంప్రదించాలని సూచించారు.

March 20, 2026 / 08:15 PM IST

భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

SRPT: సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఇవాళ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న వీరి వద్ద నుంచి రెండు బైకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణాపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

March 20, 2026 / 08:15 PM IST

మల్లంపల్లి గ్రామ పంచాయతీని తనిఖీ చేసిన DPO

WGL: దుగ్గొండి(M)లోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (DPO) కల్పన సందర్శించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.

March 20, 2026 / 08:09 PM IST

మల్లంపల్లి గ్రామ పంచాయతీని తనిఖీ చేసిన DLPO

WGL: దుగ్గొండి(M)లోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (DLPO) కల్పన సందర్శించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.

March 20, 2026 / 08:09 PM IST

బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం: ఎంపీ వద్దిరాజు

KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో జనాభాలో 60%కు పైగా ఉన్న బీసీలకు 5% నిధులు కూడా కేటాయించలేదన్నారు. 42% రిజర్వేషన్లు ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. ఉద్యోగాల హామీలు నెరవేర్చకపోవడంతో యువత నిరాశలో ఉందన్నారు.

March 20, 2026 / 08:06 PM IST

మార్చి 24న వారసంత వేలంపాట

MNCL: దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో నిర్వహించే వారసంత వేలం పాటను నిర్వహించనున్నామని ఆ గ్రామ సర్పంచ్ అనూష రాజేష్, కార్యదర్శి శ్రావణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. 2026-27 సంవత్సరానికి గ్రామంలో నిర్వహించే వారసంత వేలంపాట మంగళవారం మ.2:30 గంటలకు నిర్వహించనున్నామని వెల్లడించారు. ధరావత్ సొమ్మును చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.

March 20, 2026 / 08:05 PM IST

CSR నిధులు కేటాయించాలని వినతి

PDPL: పరిశ్రమల ప్రభావిత గ్రామాలకు సామాజిక బాధ్యత(CSR) నిధులు నేరుగా కేటాయించాలని కార్పొరేటర్లు కందుల స్వరూప సతీశ్, కన్నూరి భాగ్యలక్ష్మి కోరారు. శుక్రవారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి వీర్లపల్లి, లక్ష్మీపురం ప్రాంతాల్లో కాలుష్యం, మౌలిక వసతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాగునీరు, రోడ్ల సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

March 20, 2026 / 08:05 PM IST

ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

ASF: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు జరగనున్న ఈద్గా ప్రాంగణాలను శుక్రవారం పోలీస్ అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించారు. 

March 20, 2026 / 08:01 PM IST

మరమగ్గం చిహ్నం ఏర్పాటు

SRCL: సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్‌లో చేనేత అస్తిత్వానికి గుర్తింపుగా ‘జోటా’ మరమగ్గపు పరికరం చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా దీనిని రూపొందించారు. గతంలో ఏర్పాటు చేసిన నేతన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల తరహాలోనే, వస్త్ర పరిశ్రమ ప్రాధాన్యతను చాటేలా ఈ జోటా చిహ్నం పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

March 20, 2026 / 08:01 PM IST

బడ్జెట్ ప్రజా రంజకంగా ఉంది: కైలాష్ నేత

NLG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో Dy. CM, ఆర్థక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రజా రంజకంగా ఉందని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, యువతకు ఉపాధి కల్పించే రాజీవ్ యువ వికాసంకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా BC, SC, ST, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు.

March 20, 2026 / 07:59 PM IST

‘నిరంతరం గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయాలి’

KMM: విద్యార్థుల భోజన వసతికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిరంతరం గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని వైరా మున్సిపల్ వైస్ ఛైర్మన్ సంతోష్ స్పష్టం చేశారు. వైరా మండలంలోని గురుకుల పాఠశాలలు, సాధారణ ప్రజలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించారు. శుక్రవారం ఆయన సోమవరం వద్ద ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్‌ను సందర్శించి ప్రతినిధులతో మాట్లాడారు.

March 20, 2026 / 07:58 PM IST

పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి: ఈటెల

BHPL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు చెందిన నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఈటెల అన్నారు.

March 20, 2026 / 07:55 PM IST

పట్టాలిచ్చారు.. స్థలాలెక్కడ..?

SRPT: సూర్యాపేట మండలం ఇమ్మంపేటలో 62 మంది బేడ బుడగ జంగాలకు ఇళ్ల పట్టాలిచ్చి, స్థలాలు చూపడం లేదని హక్కుల దండు అధ్యక్షుడు బాణాల వెంకన్న మండిపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, వెంటనే తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

March 20, 2026 / 07:52 PM IST

ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలు… ప్రమాద భయం

WGL: పర్వతగిరి మండలం రావూరులో ఇళ్లపైగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తీగలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

March 20, 2026 / 07:50 PM IST