• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతు ఉత్సవాలకు తరలి వెళ్లిన రైతులు..

HNK: నర్మెట్ట రైతు ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాజీపేట 62వ డివిజన్ నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కార్పొరేటర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. రైతు ఉత్సవాలకు హాజరైన రైతులు పంట సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు, కొత్త సాంకేతికతల గురించి తెలుసుకోవాలని, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

March 20, 2026 / 03:10 PM IST

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

SRPT: మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రమీల శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఇవి కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని మునగాల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.

March 20, 2026 / 03:10 PM IST

అనుమానాస్పదగా వ్యక్తి మృతి

WGL: రాయపర్తి మండల కేంద్రంలో రాజేష్ (28) అనే వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడైన అతను ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించగా, కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 20, 2026 / 03:05 PM IST

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు

SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం, పత్యా నాయక్ తండ గ్రామాల్లో శుక్రవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చినట్లు పశువైద్యాధికారి డాక్టర్ జెస్సీ క్రాంతి తెలిపారు. ఈ మేరకు పశువులకు సాధారణ వైద్యం చికిత్సలు, సీజనల్ వారీగా వ్యాపించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ పాటిల్ సిబ్బంది ఉన్నారు.

March 20, 2026 / 03:05 PM IST

విద్యార్థులు నిత్యం శ్రద్ధతో చదవాలి: కలెక్టర్

SRCL: విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. ఇవాళ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల& కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, సిబ్బంది హాజరు రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్‌లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు.

March 20, 2026 / 03:01 PM IST

‘ప్రభుత్వ విప్‌గా బల్మూరి వెంకట్’

PDPL: శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన వెంకట్ గతంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. 2024లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విప్‌గా నియమించబడ్డారు.

March 20, 2026 / 03:01 PM IST

‘వారిని సీనియార్టీ ప్రాతిపదికన నియమించాలి’

SRCL: జనాభా గణన కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను ఉపాధ్యాయుల సీనియార్టీ ఆధారంగా నియమించాలని PRTUTS రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్ కోరారు. ఈ మేరకు చందుర్తి మండల తహసీల్దార్‌కు, PRTUTS అధ్యక్షుడు పుప్పాల శ్రీనివాసచారి నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

March 20, 2026 / 03:01 PM IST

HYDలో స్లీపింగ్ టైం తగ్గుతోంది.. జాగ్రత్త..!

HYD: నగరంలో జీవన శైలి వేగంగా మారుతున్న నేపథ్యంలో స్లీపింగ్ టైం రోజురోజుకు తగ్గిపోతోందని ఉప్పల్‌కు చెందిన డా.సుహాసిని పేర్కొన్నారు. ఉద్యోగ ఒత్తిడి, ట్రాఫిక్, మొబైల్ వినియోగం, రాత్రి జీవనం పెరగడం వంటి కారణాలు నిద్రలేమికి దారితీస్తున్నాయని తెలిపారు. సరిపడ నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవనానికి 7-8 గంటలు నిద్రించాలన్నారు.

March 20, 2026 / 03:01 PM IST

శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

RR: ఐక్యత, సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి సూచించారు. రంజాన్, శ్రీరామనవమి పండుగలను.. మన సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తిభావంతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎవరైనా ఉత్సవాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 20, 2026 / 03:01 PM IST

రైతులకు చక్కటి అవకాశం: AO

KNR: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈనెల 22న జరిగే రైతు ఉత్సవాలలో పాలకుర్తి మండలంలోని రైతులు పాల్గొనాలని మండల AOబండి ప్రమోద్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రైతు మేళాలో వ్యవసాయ అనుబంధ విభాగాలకు చెందిన 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 22న CM రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నారని అన్నారు.

March 20, 2026 / 03:01 PM IST

పిచ్చుకల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

NRML: సారంగాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ జాం పాఠశాలలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప అటవీ క్షేత్రాధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ పాల్గొని పిచ్చుకల ప్రాముఖ్యత, వాటి అంతరించడానికి కారణాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 20, 2026 / 03:01 PM IST

బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ ఆర్టీసీ బస్ స్టాండ్ మలుపు వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని దగుల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తల్లాడ ఎస్సై ఎన్ వెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 20, 2026 / 03:00 PM IST

ఎన్నికల హామీలను నెరవేర్చాలి: MP

ADB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. ఈ మేరకు బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. రైతులందరికీ రుణమాఫీ జరగలేదన్నారు. రైతు భరోసా సకాలంలో అందకపోవటంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

March 20, 2026 / 03:00 PM IST

ఉద్యమకారులు ముందస్తు అరెస్ట్

VKB: బొంరాస్‌పేట మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించనున్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టబడింది. అక్రమ అరెస్టులు తమ ఉద్యమాన్ని ఆపలేవని, సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేవని ఆశా వర్కర్లు హెచ్చరించారు.

March 20, 2026 / 03:00 PM IST

ఉమ్మడి జిల్లాను విస్మరించారు: శ్రీనివాసరావు

WGL: రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాను విస్మరించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమల ఊసే లేదని, వరంగల్ నగరంలోని మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్‌లో లేదని తెలిపారు.

March 20, 2026 / 02:55 PM IST