• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా వెంకటేష్ యాదవ్

MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ కు చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమయ్యారు. జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మైనంపల్లి హనుమంతరావుకు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

March 20, 2026 / 02:20 PM IST

నారాయణపేట చేనేత రంగానికి మంచి రోజులు

NRPT: తెలంగాణ బడ్జెట్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేనేత రంగానికి పెద్ద పీట వేస్తారని ప్రకటించడంతో నారాయణపేటలో చేనేత రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక్కడి కాటన్, పట్టు చీరలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయని ఉపముఖ్యమంత్రి ప్రకటనపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

March 20, 2026 / 02:17 PM IST

ఒకే భవనంలో రెండు శాఖలు ?

VKB: తాండూరులోని శాంతినగర్ కాలనీలో పాత మీసేవ ప్రభుత్వ భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. సమస్యల పరిష్కారానికై వచ్చే ప్రజలు ఒకే ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వచ్చినప్పుడు తికమక పడుతున్నారు. ముందుగా అద్దె భవనంలో కొనసాగిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇటీవల ట్రాఫిక్ PSలోకి మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

March 20, 2026 / 02:17 PM IST

‘ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్’

HYD: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బీ.ఆర్. అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్‌ను నిర్మిస్తున్నామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. అలాగే నింబోలి అడ్డాలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికి తగినన్ని నిధులు కేటాయించామన్నారు.

March 20, 2026 / 02:14 PM IST

మంత్రి క్యాంపు ఆఫీస్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు

NLG: నల్గొండ గడియారం సెంటర్ వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ధర్నాకు దిగారు. ఆర్డీవో అశోక్ రెడ్డి అక్కడికి చేరుకుని వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

March 20, 2026 / 02:14 PM IST

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

NZB: మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు.

March 20, 2026 / 02:14 PM IST

డీసీసీ ఉపాధ్యక్షుడిగా సాయిచరణ్ రెడ్డి

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా సాయిచరణ్ రెడ్డి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సేవలు అందిస్తున్న సాయి చరణ్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం అభినందనీయం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

March 20, 2026 / 02:13 PM IST

జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం: భట్టి

KMM: జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు.

March 20, 2026 / 02:12 PM IST

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న DMHO

KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రవీందర్ గౌడ్, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డా. విజయ్ భాస్కర్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జిల్లాలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉద్యోగుల హాజరును పరిశీలిస్తూ హడలెత్తిస్తున్నారు. కార్యక్రమంలో Dy. DM&HO డా. విద్య పాల్గొన్నారు.

March 20, 2026 / 02:09 PM IST

కేటీపీపీ ప్లాంట్‌లో 500 మెగావాట్ల ఉత్పత్తి నిలిపివేత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా నేడు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు తెలిపారు.

March 20, 2026 / 02:09 PM IST

‘రైతులు తగు జాగ్రత్తలు పాటించాలి’

WGL: వాతావరణంలో సంభవించిన మార్పులకు జిల్లా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. అనంతరం ఆమె “HIT TV” తో మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్న, వరి ధాన్యంపై పర్దాలు కప్పి ధాన్యాన్ని వర్షానికి తడవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలిపారు.

March 20, 2026 / 02:05 PM IST

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడటం లేదు..!

SRPT: అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈదునూరి సంతోష్ (తండ్రి కేశవులు) నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉంటున్న సంతోష్, గతంలో TMPS రాష్ట్ర ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన ఆచూకీ తెలిసినవారు 7075519808, 8184925512 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని కోరారు.

March 20, 2026 / 02:05 PM IST

ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశం

MNCL: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ లక్ష్మి, సిబ్బంది ఉన్నారు.

March 20, 2026 / 02:02 PM IST

రంజాన్ పండుగ కోసం ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

SRCL: రంజాన్ పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదర సోదరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, శుభ్రత, లైటింగ్, పార్కింగ్ వంటి అన్ని వసతులను సమకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

March 20, 2026 / 02:02 PM IST

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బీజేపీ

NLG: దేవరకొండ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

March 20, 2026 / 01:54 PM IST