• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. టీచర్ SUSPEND

NRPT: మద్దూరు మండలం మోమినపూర్ ఎంపీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ స్వామిని సస్పెండ్ చేసినట్లు డీఈవో గోవిందరాజు గురువారం తెలిపారు. పాఠశాలలో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై విచారించిన అధికారుల నివేదిక మేరకు ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

March 26, 2026 / 02:39 PM IST

‘నిందితుడికి కఠిన శిక్ష విధించాలి’

వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం ఘటనపై నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన పాఠశాల ప్రిన్సిపల్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

March 26, 2026 / 02:39 PM IST

భానుడు భగభగ.. వీటిని నిర్లక్ష్యం చేయకండి.!

HYD: భాగ్యనగరంలో భానుడు బగ్గుమనడంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే, ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్లకండి. ఒకవేళ వెళ్లినా వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ లాంటివి తాగడం ఎంతో మంచిది. ఎప్పుడు చెప్పేవే అని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.

March 26, 2026 / 02:37 PM IST

115వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 115వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ ఊర్లకు ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

March 26, 2026 / 02:36 PM IST

హుస్సేన్ నాయక్‌ను పరామర్శించిన కలెక్టర్

MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మరణించగా గురువారం ఆయన దశదినకర్మ కార్యక్రమాన్ని గూడూరు మండలంలోనిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ శబరిష్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లచ్చునాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్‌ను పరామర్శించి, తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

March 26, 2026 / 02:36 PM IST

పశుగ్రాస విత్తనాల పంపిణీ

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పశు ఆరోగ్య ఉప కేంద్రంలో పాడి రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా కాగా సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి పాడి రైతులకు అందజేశారు. పశు ఆరోగ్య ఉప కేంద్రం పరిధి 9 గ్రామాల రైతులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 26, 2026 / 02:31 PM IST

పేరుకు పట్నం..కనీసం రోడ్లు లేవు సార్..!

MDCL: పేరుకే పట్నం తప్ప తమ ప్రాంతంలో కనీసం రోడ్లు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్ గిరి అన్నపూర్ణ సొసైటీ పరిసరాల్లో మట్టిరోడ్లు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. స్కూల్ పిల్లలు, వృద్ధులు వెళ్లడమే కష్టంగా ఉందన్నారు.

March 26, 2026 / 02:30 PM IST

కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

MBNR: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుష్బూ గుప్తా కోరారు. రూ.లక్ష లోపు రుణాలకు 90%, రూ.3 లక్షల వరకు 70%, రూ.3-7 లక్షల లోపు రుణాలకు 60% సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

March 26, 2026 / 02:30 PM IST

బీఆర్ఎస్ మండల కన్వీనర్‌గా ప్రవీణ్

HNK: బీఆర్ఎస్ ధర్మసాగర్ మండల కన్వీనర్‌గా గుర్రపు ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని, కార్యకర్తల అందరిని ఏకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు.

March 26, 2026 / 02:25 PM IST

TB పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

HYD: తార్నాక, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన TB పేషంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. క్షయ వ్యాధి వచ్చిన వారు బలమైన పౌష్టిక ఆహారం తినడం అత్యంత కీలకమైన అంశంగా PO డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు ఒక కోడిగుడ్డు తీసుకోవాలని పేషంట్లకు సూచించారు. TB స్పెషల్ యూనిట్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

March 26, 2026 / 02:20 PM IST

కోమట్లగూడెంలో శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు

MHBD: శ్రీరామనవమి వేడుకల సందర్బంగా గంగారం మండలం కోమాట్లగూడెం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులందరూ కలిసి సంప్రదాయబద్ధంగా తలంబ్రాల బియ్యం సిద్ధంచేశారు. పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం.. మహిళలందరూ కలిసి రోకళ్లతో పసుపు దంచి, ఆ పసుపును బియ్యంలో కలిపారు.

March 26, 2026 / 02:20 PM IST

ఇసుక నిల్వలపై పోలీసుల ఉక్కు పాదం

GDWL: గట్టు మండలం బల్గెర గ్రామ శివారులో గురువారం రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన దాదాపు ఐదు టిప్పర్ల ఇసుక డంపులను SI శేఖర్, MRO విజయ్ కుమార్ గుర్తించారు. అనంతరం సీజ్ చేసి సంబంధిత నిందితులపై కేసు నమోదు చేశారు.

March 26, 2026 / 02:18 PM IST

CPI(ML) జిల్లా కమిటీ సభ్యుడుగా శ్రీకాంత్

BHPL: జిల్లా కేంద్రంలో CPI (ML) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ పాల్గొన్నారు. CPI (ML)జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బందు క్రాంతి, బందు సుజాత, స్వాతి తదితరులు ఉన్నారు.

March 26, 2026 / 02:18 PM IST

గురుకులంలో ఉచిత వైద్య శిబిరం

BDK: మణుగూరు పట్టణంలో MJPTBC బాయ్స్ రాజీవ్ గాంధీ నగర్ లో వైద్యులు ఇవాళ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా పిల్లకు టీబీ లక్షణాల వ్యాప్తి, నివారణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. HPV వ్యాక్సిన్‌ను 15 సంవత్సరాల ఆడ పిల్లలు అందరూ తీసుకోవాలని డా. సునీల్ సూచించారు.

March 26, 2026 / 02:16 PM IST

మూడు రోజులు భగీరథ నీటి నిలిపివేత

ADB: ఇచ్చోడ మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు ఈనెల 28 నుంచి 30 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాడేగాం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహణ పనులు, సీతాగొంది వద్ద పైపులైన్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలగనుంది. మూడు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని, ప్రజలు గమనించి సహకరించాలని భగీరథ నిర్వహణాధికారి తెలిపారు.

March 26, 2026 / 02:16 PM IST