HNK: బీఆర్ఎస్ ధర్మసాగర్ మండల కన్వీనర్‌గా గుర్రపు ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని, కార్యకర్తల అందరిని ఏకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు.