TG: ఉప్పల్-నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చిని నిర్మిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మూసీని తీర్చిదిద్దుతాం. గోదావరి, కృష్ణా జలాలను ఒకప్పుడు సద్వినియోగం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటున్నాం. గోదావరి నదీ జలాలను మూసీకి తరలిస్తాం. మూసీలో నిత్యం జల ప్రవాహం ఉండేలా చేస్తాం. మేం ప్రక్షాళన చేపడుతుంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు’ అని ఆరోపించారు.