• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా గణేష్ గౌడ్ నియామకం

WNP: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా మాజీ గోపాల్‌పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత కృషి గుర్తించి ఉన్నత నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.

March 20, 2026 / 01:02 PM IST

రంజాన్ సందర్భంగా ముస్లింలకు BLR తోఫాల పంపిణీ

NLG: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముస్లింలకు ప్రభుత్వ రంజాన్ తోఫా కానుకలను పంపిణీ చేశారు. ప్రజాపాలనలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనేక పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

March 20, 2026 / 01:01 PM IST

మృతిడి కుటుంబానికి గ్రామస్తుల ఆర్థిక సహాయం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన బత్తుల శివ కుటుంబాన్ని గ్రామస్తులు పరామర్శించారు. ఇద్దరు చిన్న పిల్లలతో ఉన్న ఆ కుటుంబానికి సేవ యువత సభ్యులు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువత గ్రామ పెద్దలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు

March 20, 2026 / 01:01 PM IST

గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

HYD: గన్‌పార్క్ దగ్గర BRS ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేయడం ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తోంది.

March 20, 2026 / 12:54 PM IST

ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటాం: జిల్లా అధ్యక్షుడు

MLG: ములుగు జిల్లాలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. గోవిందరావుపేట (M) పస్రా గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను స్థానిక నేతలతో కలిసి జిల్లా అధ్యక్షులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.

March 20, 2026 / 12:53 PM IST

ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన MEO

NZB: భీంగల్ ఎంపీపీఎస్ పాఠశాలను శుక్రవారం MEO స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) AXL కంప్యూటర్ తరగతులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ, శిక్షణ గురించి ప్రధానోపాధ్యాయుడు సత్య రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపడం పట్ల ఎంఈవో హర్షం వ్యక్తం చేశారు.

March 20, 2026 / 12:53 PM IST

అటవీ వనరుల అక్రమ రవాణా.. స్థానికులు ఆందోళన

VKB: ధారూర్ మండలంలోని అల్లాపూర్, రుద్రారం, నాగసమందర్ అటవీ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. రహస్య మార్గాలు ఏర్పాటు చేసి వాగులను గుల్లగా తరలిస్తూ ప్రభుత్వ వనరులను దోచుతున్నారని స్థానికులు తెలిపారు. రుద్రారం, అల్లాపూర్, గట్టేపల్లి, తిమ్మనగర్ గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్లు సమాచారం.

March 20, 2026 / 12:45 PM IST

నెట్ జీరో భవనాల వైపు ప్రజల చూపు..!

HYD మహానగర వాసులు నెట్ జీరో భవనాల వైపు మళ్లుతున్నారు. చుట్టుపక్కల గ్రీనరీ పెంపుతో పాటు, పర్యావరణహిత నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నారు. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల వరకు పరిమితం చేయాలంటే నిర్మాణ రంగంలో మార్పులు అనివార్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది భవిష్యత్ తరాలకు స్థిరమైన జీవన విధానానికి దారి చూపుతుంది.

March 20, 2026 / 12:45 PM IST

కాంగ్రెస్ జిల్లా సెక్రటరీగా శ్రీనివాస్

NZB: జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఆయన శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

March 20, 2026 / 12:41 PM IST

జిల్లా కాంగ్రెస్ స్పోక్ పర్సన్స్‌కు సన్మానం

వనపర్తి జిల్లా కాంగ్రెస్ స్పోక్ పర్సన్‌గా నియమితులైన కోళ్ల వెంకటేష్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత నందిమల్ల చంద్రమౌళి తదితరులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్పోక్ పర్సన్‌గా వెంకటేష్ నియామకంపై హర్ష వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోకం బాలరాజు, భాస్కర్, వలి, ఆంజనేయులు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

March 20, 2026 / 12:40 PM IST

పూజారి తాండలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

GDWL: కేటిదొడ్డి మండలం పూజారి తాండ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ దేవసప్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి. గ్రామ అభివృద్ధికి తీసుకున్న ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

March 20, 2026 / 12:38 PM IST

గుండెపోటుతో వ్యక్తి మృతి.. అతని కళ్ళు సజీవం

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆయిళ్ల మల్లేష్(55)శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మృతుని కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది నేత్రాలను సేకరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.

March 20, 2026 / 12:38 PM IST

జాతర ఉత్సవాల్లో రథోత్సవం

SRD: సిర్గాపూర్ మండలంలోని పోచాపూర్ గ్రామంలో దుర్గా భవాని మాత జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్థానిక కాశీ విశ్వనాథ మందిరం నుంచి రథోత్సవం మొదలైంది. అంతకుముందు గ్రామస్తులు ఆచార సాంప్రదాయం ప్రకారంగా రథం ఎదుట నైవేద్యం భక్షాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత గ్రామ పెద్దలు రథాన్ని లాగి శోభయాత్ర చేపట్టారు

March 20, 2026 / 12:37 PM IST

మహిళా సంఘ భవనానికి భూమిపూజ

KMR: రాజంపేట మండలం పొందుర్తిలో మహిళా సంఘం భవనానికి భూమిపూజ చేసినట్లు మండల అభివృద్ధి అధికారి బాలకృష్ణ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా విడుదలైన రూ.10లక్షలతో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ గర్గుల బాబు, ఐకేపీ సీసీ, కమ్యూనిటీ కోఆర్డినేటర్ వివోఏలు పాల్గొన్నారు.

March 20, 2026 / 12:34 PM IST

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాము యాదవ్ నియామకం

NGKL: కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాము యాదవ్‌ను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. రాము యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, నేతలకు ధన్యవాదములు తెలిపారు.

March 20, 2026 / 12:33 PM IST