• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ప్రదీప్

నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం 32వ తర్ప అధ్యక్షుడిగా ప్రదీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సంఘ సమావేశంలో సభ్యులు ప్రదీప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాద్యక్షుడిగా చాట్ల గణేష్, ప్రధాన కార్యదర్శిగా అంకం బాల్ కిషన్, కోశాధికారిగా కర్ణాల నవీన్, ఉపాద్యక్షుడిగా పీ.శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

March 20, 2026 / 11:47 AM IST

రంజాన్ ఏర్పాట్లు పరిశీలన

SDPT: రంజాన్ పండుగకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి పరిశీలించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈదుల్ ఫీతర్ నమాజ్ కోసం వేలాది మంది హాజరవుతారని, వారికి తాగునీరు, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారి వెంట వైస్ ఛైర్ పర్సన్ చిత్తరి పద్మ, కౌన్సిలర్ సంపత్ తదితరులున్నరు.

March 20, 2026 / 11:47 AM IST

రామడుగు ఆలయ అభివృద్ధికి దాతల విరాళం

NZB: సిరికొండ మండలం రామడుగులో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం కోసం శుక్రవారం విరాళాలు సేకరించారు. కమిటీ ఛైర్మన్ పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ ఛైర్మన్ గోపాల్ రూ. 20 వేలు, సర్పంచ్ వరలక్ష్మి రూ. 15 వేలు, రాజకిషన్, గంగాధర్ రూ. 11 వేల చొప్పున అందజేశారు.

March 20, 2026 / 11:41 AM IST

చెట్టును ఢీ కొన్న కారు.. వ్యక్తికి తీవ్రగాయాలు

మంచిర్యాల: వేంపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడ్డెర కాలనీకి చెందిన పల్లపు ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వెంటనే చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించారు.

March 20, 2026 / 11:35 AM IST

వనపర్తి జిల్లా వాసికి మిద్దెతోట పురస్కారం..

WNP: రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే శ్రీ తుమ్మేటి రాఘోత్తమ రెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారం-2025కు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పోల్కంపల్లి సుజాత ఎంపిక అయింది. తన ఇంటి టెర్రస్‌పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను గత 5సం.లుగా సాగు చేస్తున్నందున ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం ఏపీలోని గుంటూరులో ఈఅవార్డును అందజేయనున్నారు

March 20, 2026 / 11:35 AM IST

కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా జూలూరీ సుధాకర్

KMR: జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. పార్టీలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, మహేష్ కుమార్ గౌడ్‌కు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.

March 20, 2026 / 11:34 AM IST

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న కౌన్సిలర్లు

NLG: ఎండలు తీవ్ర రూపం దాల్చకముందే చిట్యాల మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా 8,9 వార్డుల్లో ఇళ్లలోకి సరిగా నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయా వార్డు కౌన్సిలర్లు కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్ వెంటనే స్పందించి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అధికారులు పరిస్థితిని గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

March 20, 2026 / 11:33 AM IST

‘సేవ్ సింగరేణి జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

ASF: సింగరేణి పరిరక్షణ కోసం శనివారం నిర్వహించనున్న ‘సేవ్ సింగరేణి’ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని AITUC గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి పిలుపునిచ్చారు. రెబ్బెన మండలం గోలేటిలో శుక్రవారం మాట్లాడారు. ఈ జాతా గోలేటిలో ప్రారంభమై కొత్తగూడెంలో ముగుస్తుందని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.

March 20, 2026 / 11:32 AM IST

పాడి రైతులకు హెచ్చరిక.. టీకాలు తప్పనిసరి

MDK : చిలిపిచేడ్ మండల కేంద్రంలో గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఎల్ఎస్ఏ డాక్టర్ గట్టయ్య బృందం పశువులకు టీకాలు వేసింది. సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ శ్రీరాములు పాల్గొని పాడి రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.

March 20, 2026 / 11:32 AM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ సరిత కొత్త కార్యక్రమం

MULG: ఏటూరు నాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోరిక సరిత ‘ప్రజా వాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తామని, అవసరమైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

March 20, 2026 / 11:30 AM IST

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కమిటీ సభ్యులు

HNK: పరకాల మున్సిపాలిటీ 17వ వార్డు మల్లారెడ్డిపల్లికి వీధిలో కాంగ్రెస్ నాయకుడు కిషన్ తల్లి పుష్ప మరణించగా వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్, మడికొండ శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో భాస్కర్, శ్రీనివాస్, రమేష్, తదితరులు ఉన్నారు.

March 20, 2026 / 11:27 AM IST

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన సమన్వయ కమిటీ సభ్యులు

HNK: పరకాల మున్సిపాలిటీ 17వ వార్డు మల్లారెడ్డిపల్లికి వీధిలో కాంగ్రెస్ నాయకుడు కిషన్ తల్లి పుష్ప మరణించగా వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్, మడికొండ శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో భాస్కర్, శ్రీనివాస్, రమేష్, తదితరులు ఉన్నారు.

March 20, 2026 / 11:27 AM IST

GREAT..ఖాళీగా ఉండకుండా..కష్టపడుతూ..!

HYD: సాధారణంగా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక సెలవులు ఎంజాయ్ చేయాలని చాలామంది భావిస్తారు. కానీ..హైదరాబాద్‌లో ఓ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. మూడు నెలల ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, కుటుంబ ఖర్చులు, కాలేజీ ఫీజులకు తోడ్పడేందుకు కష్టపడుతున్నాడు. చెమటోడుస్తూ పని చేస్తున్న అతడిని చూసిన వారు అతని పట్టుదల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

March 20, 2026 / 11:26 AM IST

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.. పలువురు నివాళి

WGL: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడలా ప్రభాకర్ తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన పార్ధ్వదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 20, 2026 / 11:25 AM IST

మక్కల కొనుగోలు వెంటనే ప్రారంభించాలి: ఎర్రబెల్లి

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

March 20, 2026 / 11:24 AM IST