తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ పద్దుపై చర్చ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్డీపీ పరిమితికి మించి 25 శాతం ఎక్కువ అప్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు చెప్పారు. మరోవైపు కేంద్రం మద్దతు ధర కోసం రాష్ట్రానికి రూ.95 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఈటల గుర్తు చేశారు. బీసీల కోసం బడ్జెట్లో పెట్టిన మొత్తాన్ని విడుదల చేయడం లేదని ఈటల ప్రశ్నించారు.
మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ సభ్యులకు వసతులు కూడా కల్పించలేదని ఈటల విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుకునేందుకు ఒక రూం కూడా కేటాయించలేదన్నారు. అంతేకాదు ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తెచ్చుకున్నా కూడా తినే అవకాశం ఇవ్వలేదన్నారు. ఆ క్రమంలో మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని కనీసం ఐదురుగు సభ్యులు ఉంటేనే గది ఇవ్వాలన్న నిబంధన ఉన్నట్లు తెలిపారు.