బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10వ తేదీన చెన్నై వెళ్లనున్నారు. ‘2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై చర్చలో పాల్గొంటారు. కవితతోపాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ హాజరవుతారు. బీఆర్ఎస్ పార్టీ ఎజెండా, దేశాభివృద్దికి కేసీఆర్ ఆలోచనలను కవిత వివరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో క్రమంగా తమ పార్టీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. కల్వకుంట్ల కవిత చెన్నై పర్యటన మాత్రం ఓ సంస్థ నిర్వహించే చర్చలో పాల్గొంటారు. అక్కడ ఇతర పార్టీ నేతలతో సమావేశం అవుతారు.
కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న విచారించి.. ఈ రోజు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ది చేకూరేలా బుచ్చిబాబు వ్యవహరించారని సీబీఐ చెబుతోంది. అరెస్టుకు ముందు నిన్న రాత్రి బుచ్చిబాబును సుధీర్ఘంగా ప్రశ్నించారు. వైద్య పరీక్షల చేసిన తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో బుచ్చిబాబును హాజరుపరుస్తారు. రిమాండ్‌కు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.