ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కలిశారు. కవితతో కాసేపు మాట్లాడిన ఆయన తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
KTR :ఢిల్లీలోని తీహార్ జైలులో కవితతో కేటీఆర్ నేడు ములాఖత్ అయ్యారు. కవితను కలిసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత తీహార్ జైలులో ఉంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో జూన్ 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కేటీఆర్ తన సోదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు మాట్లాడిన తరువాత తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ కేసులో ఈడీ సైతం పలు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జైలులో కవిత చదువుకోవడానికి పుస్తకాలు కావాలని కోర్టును కోరగా.. అందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇక తదుపరి విచారణ జూన్ 21న జరగనుంది.