»Justice Pc Ghoshs Ongoing Inquiry Into The Kaleswaram Project
Kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతోంది. తాజాగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంజనీర్లు కమిటీ ముందు హాజరయ్యారు.
Justice PC Ghosh's ongoing inquiry into the Kaleswaram project
Kaleswaram project: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే భారీ ప్రాజెక్టులలో ఒకటి. లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర రైతాంగానికి సేద్యం నీళ్లు అందించేందుకు ఈ ప్రాజెక్టును కట్టారు. అయితే కాళేశ్వరంలో ప్రాజెక్టులో మెడిగడ్డ బరాజ్ ఒకటి. అందులో మూడు పిల్లర్లలో పగుళ్లు రావడంతో ప్రాజెక్ట్ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందులో భాగంగా నూనతంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ జరిపించాలని అధికారులకు అప్పజెప్పింది. దీంతో రంగంలోకి దిగిని జస్టిసి పీసీ ఘోష్ కమిటీ విచారణ చేపట్టింది.
దీనిలో భాగంగానే ఈరోజు ప్రాజెక్ట్ ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో విచారణ నిర్వహిస్తుంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజినీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజినీర్లు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు అడిగి, సమాధానాలు తెలుసుకుంటుంది. మొత్తం ఈ ప్రాజెక్టులో ఉన్న అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే నివేదిక తయారు చేయనుంది. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.