ATP: ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రస్తుత కాలంలో పోలీస్ వ్యవస్థలో సాంకేతికత పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని సబ్ డివిజన్ల పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంకేతికత నేర నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలకమని అదనపు ఎస్పీ తెలిపారు.