ప్రకాశం: కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20మంది మృతి చెందిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలపై పొదిలి పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోలను ఎస్సై వేమన శనివారం తనిఖీలు చేశారు. వాహనాల ఫిట్నెస్, పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు పరిశీలించారు. ఈ మేరకు విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించి వేగంగా నడపవద్దని డ్రైవర్లకు సూచనలు చేశారు.