CTR: పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్షావలి శనివారం తెలిపారు. ఈ మేరకు సదుం మండలంలోని చెరుకువారిపల్లె పంచాయతీ పరిధిలోని బాపనచెరువు మొరవ వద్ద ఉన్న మామిడి తోటలో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడుల్లో పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద రూ. 72,600 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.