TG: హైదరాబాద్లోని చాదర్ఘాట్లో జరిగిన కాల్పులపై HYD సీపీ సజ్జనార్ స్పందించారు. దుండగులు డీసీపీ చైతన్యపై కత్తితో దాడిచేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆత్మరక్షణార్ధం దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని వెల్లడించారు. డీసీపీ సహా మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.